న్యూఢిల్లీ: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం ఇటలీ వెళ్లారు. ఈ సదస్సులో భారత్ ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), ఎనర్జీ, ఆఫ్రికా, మెడిటెర్రేనియన్పై దృష్టి సారిస్తుందని మోదీ చెప్పారు. ఆయన మూడోసారి పీఎం పదవిని చేపట్టిన తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన.
జీ7 సదస్సు ఈ నెల 13 నుంచి 15 వరకు జరుగుతుంది. మోదీ శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు, వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.