మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ.. అక్కడి ప్రసిద్ధ అగర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఆయనతోపాటు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అగర్నాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కాగా, ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి ప్రధాని ఇవాళ మీరట్‌కు వెళ్లారు. మీరట్ నగరంలో సర్ధానా పట్టణ పరిధిలోని సలవ-కైలీ గ్రామాల మధ్య ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించనున్నారు. అంతకుముందు షాహిద్ స్మారక్ను ప్రధాని సందర్శించి నివాళులర్పించారు.
Prime Minister Narendra Modi offers prayers at Augurnath temple in Meerut, UP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 2, 2022
He is accompanied by Governor Anandiben Patel and CM Yogi Adityanath
Later, PM will lay the foundation stone of Major Dhyan Chand Sports University in Meerut
(Source: DD) pic.twitter.com/LJdLxtZrBI