న్యూఢిల్లీ: ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నేజాతీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో.. అండమాన్ నికోబార్ దీవుల్లోని మరో 21 పేరులేని దీవులకు నామకరణం చేశారు. ఆ 21 దీవులకు 21 మంది పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు.
सभी 21 परमवीर…सबके लिए एक ही संकल्प था- राष्ट्र सर्वप्रथम! India First! pic.twitter.com/4LarHjMkU1
— PMO India (@PMOIndia) January 23, 2023
మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్, లాన్స్ నాయక్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘోబా రాణే, నాయక్ జాదునాత్ సింగ్, హవల్దార్ పీరూ సింగ్, కెప్టెన్ జీఎస్ సలేరియా, లెఫ్టినెంట్ కల్నల్ ధాన్ సింగ్ తప్పా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ శైతాన్ సింగ్, కంపెనీ క్వార్టర్‌మాస్టర్ అబ్దుల్ హమిద్, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్దేశిర్ బుర్జోరీ తారాపోర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజరల్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ శేఖన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయిబ్ సుబేదార్ బానా సింగ్, కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్‌ల పేర్లను 21 దీవులకు ఫిక్స్ చేశారు.
India pays tributes to Netaji Bose – one of the greatest sons of the country. pic.twitter.com/GsjHVL4uDL
— PMO India (@PMOIndia) January 23, 2023
On the occasion of 126 birth anniversary of Netaji #SubashChandraBose 21 islands of Andaman and Nicobar are being named after 21 #ParamvirChakra awardees! What a fitting tribute to the Warriors who made the supreme sacrifice! Jai Hind! 🙏🌺🇮🇳🇮🇳🇮🇳 @narendramodi pic.twitter.com/RyOeZYEIjT
— Anupam Kher (@AnupamPKher) January 23, 2023