న్యూఢిల్లీ, జూన్ 17: రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారణాసి స్థానంతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని మరో చోట నుంచి ప్రధాని బరిలో నిలబడతారని సమాచారం. తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాజదండంతో చేపట్టిన తంతు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నదని తెలిసింది.