PM Modi : హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ పరిధిలో చార్మినార్ (Charminar) సమీపంలోని గుల్జార్ హౌస్ (Guljar house) లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం తీవ్ర ఆవేదన కలిగించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మృతుల బంధువులకు పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా,గాయపడిన వారికి…
— PMO India (@PMOIndia) May 18, 2025
కాగా ఆదివారం ఉదయం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు 8 మంది చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, యశోద (మలక్పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో కొందరు ఘటనాస్థలంలోనే మరణించగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదంలో మరణించిన వారిలో రాజేంద్రకుమార్ (67), అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. మరో వ్యక్తి పేరు తెలియాల్సి ఉంది.