Amritpal Singh: కారును సీజ్ చేశారు.. కానీ అమృత్‌పాల్ ఇంకా అరెస్టు కాలేదు
Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ ను ఇంకా అరెస్టు చేయలేదని ఐజీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు. అతని పారిపోయిన బ్రీజా కారును సీజ్ చేసినట్లు చెప్పారు. అతనికి సహకరించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
చండీఘడ్: ఖలిస్తానీ నేత అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) కోసం నాలుగు రోజుల నుంచి పంజాబ్ పోలీసులు వేటాడుతున్న విషయం తెలిసిందే. బ్రీజా కారులో ఆయన ఓ టోల్‌ప్లాజా నుంచి తప్పించుకున్నట్లు కొన్ని వీడియోలు లీకయ్యాయి. దీనిపై ఐజీ సుఖ్‌చైన్ సింగ్(IG Sukhchain Sing Gill) గిల్ స్పందించారు. అమృత్‌పాల్ సింగ్ పారిపోయిన కారును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. నలుగురు వ్యక్తులు అతనికి సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నలుగురిపై ఆర్మ్స్ యాక్ట్(Arms Act)ను ఇన్వోక్ చేసినట్లు వెల్లడించారు. కారులో నుంచి పారిపోయిన అమృత్‌పాల్.. జలంధర్ జిల్లాలోని నాన్గల్ అంబియన్ గ్రామంలో ఉన్న గురుద్వారాను విజిట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ అతను దుస్తులు మార్చుకుని పారిపోయినట్లు గుర్తిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్‌పై నేషనల్ సెక్యూర్టీ యాక్టు(NSA) కింద కేసు బుక్ చేసినట్లు ఐజీ తెలిపారు. మార్చి 18వ తేదీన నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసినట్లు చెప్పారు. అమృత్‌పాల్ సింగ్‌కు చెందిన రకరకాల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. అమృత్‌పాల్‌ను అరెస్టు చేసిన వెంటనే ఆ విషయాన్ని వెల్లడించనున్నట్లు ఐజీ సుఖ్‌చైన్ తెలిపారు.
Punjab Police releases a few pictures of 'Waris Punjab De' chief Amritpal Singh.
"There are several pictures of Amritpal Singh in different attires. We are releasing all of these pictures. I request you display them so that people can help us to arrest him in this case," says… pic.twitter.com/wh7gNb4BUA
— ANI (@ANI) March 21, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

