న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశవ్యాప్తంగా 35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్టు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) ప్రకటించింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మ ంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఎన్పీపీఏ’ ఆదివారం ఈమేరకు ఒక నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నిర్ణయంతో మధుమేహం, గుండె సం బంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, నొప్పి నివారణ, యాంటీ బయాటిక్ సహా వివిధ రకాల కీలక ఔషధాల ధరలు తగ్గుతాయని సమాచారం. కొత్తగా నిర్ణయించిన ధరల జాబితాను రిటైల్ వ్యాపారులు, డీలర్లు తమ దుకాణాల్లో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఎన్పీపీఏ పేర్కొన్నది.