న్యూఢిల్లీ, జూన్ 4 : షుగర్, హై బీపీ, హృద్రోగాలు, ఇన్ఫెక్షన్లు, మహిళల ఆరోగ్య సమస్యలకు వాడే 30 అత్యవసర ఔషధాల ధరలను సవరించాలని నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దీర్ఘకాలం ఈ వ్యాధులకు చికిత్స పొందుతున్న పౌరుల చికిత్స ఖర్చు తగ్గనుంది.
అయితే ఈ తగ్గించిన ధరలు రోగులకు వచ్చే రెండు మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయని పరిశ్రమకు చెందిన ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతమున్న మందుల స్టాక్ పూర్తిగా అయిపోయిన తర్వాతే కొత్త మందుల అమ్మకం ప్రారంభమవుతుందని వారు చెప్పారు.