గురువారం 28 జనవరి 2021
National - Dec 31, 2020 , 01:53:33

ఫోన్‌ టవర్ల విధ్వంసాన్ని అడ్డుకోండి

ఫోన్‌ టవర్ల విధ్వంసాన్ని అడ్డుకోండి

పంజాబ్‌ సీఎంకు రిలయన్స్‌ జియో లేఖ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30: రైతుల నిరసనల నేపథ్యంలో తమ టెలిఫోన్‌ టవర్లు విధ్వంసానికి గురవుతుండటంపై రిలయన్స్‌ జియో సంస్థ పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌కు లేఖ రాసింది. అన్నదాతల ముసుగులో టవర్లను ధ్వంసం చేస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు నష్టం చేకూరుస్తుండటంతో రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీలే ఎక్కువ లబ్ధిపొందుతున్నారని విశ్వసిస్తున్న రైతులు.. ఇందులో భాగంగానే అంబానీకి చెందిన టెలికం టవర్లపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, టవర్ల ధ్వంసంపై అసోచామ్‌ కూడా సీఎంకు లేఖ రాసింది. 


logo