చండీగఢ్: ఒక ఇంట్లోని వంట గదిలో ఆహారం వండుతుండగా ప్రెజర్ కుక్కర్ పేలింది. (Pressure Cooker Explodes) ఆ సమయంలో ఆ వంట గదిలో ఉన్న మహిళలు, కాస్త దూరంలో ఉన్న ఒక వ్యక్తి, బాలుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రెజర్ కుక్కర్ పేలడంతో ఆ వంట గది, అక్కడి వస్తువులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్లోని పాటియాలాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఏక్తా విహార్ ప్రాంతంలోని ఒక ఇంట్లోని వంట గదిలో ఇద్దరు మహిళలు ఆహారం తయారు చేస్తున్నారు. అయితే గ్యాస్ పొయ్యి మీద ఉన్న ప్రెజర్ కుక్కర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వంట గదితోపాటు అక్కడి వస్తువులు, చిమ్నీ ధ్వంసమయ్యాయి.
కాగా, ప్రెజర్ కుక్కర్ పేలిన శబ్ధం విన్న వెంటనే వంట గదిలో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో డైనింగ్ టేబుల్ వద్ద ఒక వ్యక్తి ఉండగా, ఒక బాలుడు బంతితో ఆడుకుంటున్నాడు. ఆ ఇద్దరితోపాటు ఇంట్లో ఉన్న వారు కూడా భయంతో బయటకు పరుగుతీశారు. అయితే ప్రెజర్ కుక్కర్ పేలిన సంఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CCTV visuals captured a cooker blast in the kitchen while preparing ‘Saag.’ Luckily, no one got injured and everyone was saved. #Patiala #Punjab pic.twitter.com/DHwirQoGXx
— Gagandeep Singh (@Gagan4344) December 13, 2023