న్యూఢిల్లీ : పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్త జనకోటికి రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఒడిశాలోని భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీర్వాదంతో.. దేశ ప్రజలందరూ జీవితాంతం ఆనందంతో, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
కరోనా కారణంగా జగన్నాథుని రథయాత్రను ఒడిశా ప్రభుత్వం ఈ ఏడాది పూరీకే పరిమితం చేసింది. గతేడాది మాదిరిగానే భక్తులు లేకుండా రథయాత్ర కొనసాగనుంది. రథయాత్ర నేపథ్యంలో పూరీలోని అన్ని దారులను మూసివేసి, రాకపోకలను రద్దు చేశారు. రేపు రాత్రి 8 గంటల వరకు పూరీలో కర్ఫ్యూ విధించారు. పూరీలోకి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించింది ఒడిశా ప్రభుత్వం.
My warm greetings to all countrymen, especially all the devotees in Odisha, on the auspicious occasion of Rath Yatra of Lord Jagannath. I wish, with the blessings of Lord Jagannath, lives of all countrymen remain full of happiness, prosperity & health: President Ram Nath Kovind pic.twitter.com/qS9X9x6wQq
— ANI (@ANI) July 12, 2021