President Murmu : గడిచిన పదేళ్ల ఎన్డీఏ పాలన (NDA rule) లో దేశంలో 25 కోట్ల మందికి పేదరికం
(Poverty) నుంచి విముక్తి కల్పించామని రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)
అన్నారు. బుధవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Budget Session) ప్రారంభం సందర్భంగా ఉభయ
సభలను ఉద్దేశించి ముర్ము ప్రసంగించారు. అదేవిధంగా దేశంలో 10 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, వికసిత్ భారత్‌లో రైతులకు ప్రథమ
ప్రాధాన్యం ఇచ్చామని, వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని రాష్ట్రపతి అన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేశం సంస్కరణల పథంలో దూసుకెళ్తోందని అన్నారు. పీఎల్ఐ
పథకం కింద పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి
సాధించామని చెప్పారు. సముద్ర వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.
భారత్‌పై దాడిచేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసిందని రాష్ట్రపతి అన్నారు. ఈ ఆపరేషన్
తర్వాత డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగినట్లు వెల్లడించారు.