న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ (70) మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దిలీప్ గాంధీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మధ్యప్రదేశ్‌లోని అహ్మాద్‌నగర్ నుంచి ఆయన మూడుసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. జనాధరణ కలిగిన నాయకుడిగా నిరంతరం తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి దిలీప్ గాంధీ కృషి చేశారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన దిలీప్ గాంధీ (70) ఢిల్లీలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. అహ్మద్‌నగర్ దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో నౌకాయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
पूर्व केंद्रीय मंत्री श्री दिलीप गांधी के निधन के बारे में सुनकर अत्यंत दुःख हुआ। अहमदनगर से तीन बार लोकसभा सांसद रहे श्री गांधी, एक लोकप्रिय जनसेवक थे जो अहमदनगर और महाराष्ट्र के विकास के लिए सदैव प्रयत्नशील रहे।मैं उनके स्वजनों एवं शुभचिंतकों के प्रति संवेदना व्यक्त करता हूं।
— President of India (@rashtrapatibhvn) March 17, 2021