న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన భవీనాబెన్ పటెల్ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ సంకల్పం దేశానికి కీర్తిని తెచ్చాయని, ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని అన్నారు.
President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics
— ANI (@ANI) August 29, 2021
"…Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY
సిల్వల్ మెడల్ సాధించిన భవీనాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన భవీనా.. భారత బృధానికి, క్రీడాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ అసాధారణ సంకల్పం, నైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. మీకు నా అభినందనలు’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
PM Modi congratulates Para-paddler Bhavina Patel on winning a Silver medal at Tokyo Paralympics
— ANI (@ANI) August 29, 2021
"The remarkable Bhavina Patel has scripted history! …Her life journey is motivating and will also draw more youngsters towards sports," he says. pic.twitter.com/CDlW1KS5d7
భవీనాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘భవీనా పటేల్ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్ మెడల్ తీసుకొస్తున్నది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి, ఆమె ప్రయాణం యువతను క్రీడలవైపు ఆకర్షిస్తున్నది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.