న్యూఢిల్లీ: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సుహాస్ యతిరాజ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రశంసించారు. రజతం గెలవడమే సుహాస్ అంకితభావానికి నిదర్శనమని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే పతకం గెలిచాడని అభినందించారు.
‘ప్రపంచ నంబర్.1 ఆటగాడికి గట్టి పోటీ ఇచ్చి రజత పతకం సాధించిన యతిరాజ్‌కు అభినందనలు. కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే స్పోర్ట్స్‌పై దృష్టి పెట్టడం గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
President Ram Nath Kovind congratulates Noida DM and para-badminton player Suhas L Yathiraj on winning the Silver medal at #Tokyoparalympics2020
— ANI (@ANI) September 5, 2021
"Your dedication in pursuing sports while discharging duties as a civil servant is exceptional," he says. pic.twitter.com/pIj9y6WckU
‘సుహాస్ యతిరాజ్ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తున్నది. స్పోర్ట్స్‌లో ఈ ఘనత సాధించిన యతిరాజ్‌కు శుభాకాంక్షలు. సర్వీస్‌లో ఉంటూ పారాలింపిక్స్‌లో రజతం సాధించి దేశం దృష్టిని ఆకర్షించాడు. భవిష్యత్తులో యతిరాజ్ మరింతగా రాణించాలని ఆశిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
"Suhas Yathiraj has captured the imagination of our entire nation thanks to his exceptional sporting performance," says PM Narendra Modi congratulating Noida DM on winning the Silver medal in Badminton at #Tokyoparalympics pic.twitter.com/nUiQphVoOr
— ANI (@ANI) September 5, 2021
పారాలింపిక్స్ పతక విజేతకు అభినందనలు తెలిపారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. గతంలో కూడా యతిరాజ్ ఎన్నో పతకాలు గెలిచారని అన్నారు. అధికారిగా విధులు నిర్వహిస్తూనే పారాలింపిక్స్‌లో పతకం నెగ్గడం హర్షనీయమని చెప్పారు.
I extend my heartfelt congratulations to him. On earlier occasions also he won many medals. Along with efficiently discharging his administrative duties, he has been successful in Paralympics: CM Yogi Adityanath on Noida DM Suhas L Yathiraj winning Silver in #TokyoParalympics pic.twitter.com/W7bVwfh40p
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2021