న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ ఆశయాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. తన అసాధారణమైన దేశభక్తితో, అద్భుతమైన ప్రసంగంతో యువతను సంఘటితం చేసి పరాయి పాలనకు పునాది వేశాడని అమిత్ షా వ్యాఖ్యానించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నివాళులర్పించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భారతదేశానికి స్వేచ్ఛకల్పించడానికి తీసుకున్న సాహసోపేతమైన చర్యలు ఆయనను జాతీయ చిహ్నంగా నిలిపాయన్నారు. నేతాజీ ఆశయాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
India gratefully pays homage to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. The daring steps that he took to fulfil his fierce commitment to the idea of a free India — Azad Hind — make him a national icon. His ideals and sacrifice will forever inspire every Indian.
— President of India (@rashtrapatibhvn) January 23, 2022
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన అసాధారణమైన దేశభక్తితో, ఎనలేని ధైర్యం, అద్భుతమైన ప్రసంగంతో యువతను సంఘటితం చేసి పరాయి పాలనకు పునాది వేసాడని చెప్పారు. మాతృభూమి కోసం ఆయన చేసిన అసమాన త్యాగం, పట్టుదల, పోరాటం దేశానికి ఎల్లవేళలా మార్గదర్శకమని తెలిపారు.
आजादी के महानायक नेताजी सुभाष चन्द्र बोस की जयंती पर उन्हें कोटिशः नमन करता हूँ।
— Amit Shah (@AmitShah) January 23, 2022
उन्होंने अपने असाधारण देशप्रेम, अदम्य साहस व तेजस्वी वाणी से युवाओं को संगठित कर विदेशी शासन की नींव हिला दी।
मातृभूमि के लिए उनका अद्वितीय त्याग, तप व संघर्ष सदैव देश का मार्गदर्शन करता रहेगा। pic.twitter.com/cTepfFE6pN