న్యూఢిల్లీ: భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి సర్వ సిద్ధమయింది. సోమవారం ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము.. మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అటునుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ద్రౌపది ముర్ము పార్లమెంటుకు ఊరేగింపుగా వస్తారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. ప్రమాణం అనంతరం రాష్ట్రపతిగా తొలి ప్రసంగం చేయనున్నారు.
#WATCH | President-elect #DroupadiMurmu pays tribute at Rajghat in Delhi. She will take oath as the 15th President of the country today.
(Video Source: Rashtrapati Bhavan Twitter account) pic.twitter.com/pen5zhVHwR
— ANI (@ANI) July 25, 2022