న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. గతంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. ప్రధాని ఆఫీసులో 4399 రోజుల పాటు మోదీ వరుసగా ఆ బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్రంలో 12 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న మోదీకి ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) శుభాకాంక్షలు తెలిపారు. అతిసుదీర్ఘ కాలం ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన విశిష్ట గౌరవాన్ని పొందారని ముర్ము తన స్టేట్మెంట్లో తెలిపారు.
భారత ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి ఈ అసాధారణ మైలురాయి ఓ పరీక్షగా నిలుస్తుందని, నమ్మకానికి.. విశ్వాసాన్ని చాటుతుందన్నారు. తన ఎక్స్ అకౌంట్లో రాష్ట్రపతి ముర్ము ఓ పోస్టు చేశారు. పరిపాలనలో ఆధునీకరణ, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి నిదర్శనంగా మీ పాలన నిలుస్తుందన్నారు. మీరు చేరుకున్న మైలురాయి.. బలమైన భారత ప్రజాస్వామ్య సంప్రదాయంలో కొత్త ఉత్సహాన్ని, విశ్వాసాన్ని ఇస్తుందని ముర్ము అన్నారు.
Heartiest congratulations to Prime Minister Shri Narendra Modi ji on the unique honour of serving as the longest continuously elected Prime Minister of the nation. This landmark occasion stands as a testament to the enduring trust and confidence reposed in your leadership by the…
— President of India (@rashtrapatibhvn) June 10, 2026