న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, పౌర భద్రత రంగాలకు చెందిన 942 మందికి గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలు ప్రకటించింది. ఈ పోలీస్ పతకాలు లభించిన వారిలో 12 మంది తెలంగాణ వారు ఉన్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయుధ దళాలు, కేంద్ర సాయుధ దళాలకు చెందిన 93 మందికి శౌర్య పురస్కారాలను ప్రకటించారు.
అందులో ఇద్దరికి కీర్తి చక్ర 14 శౌర్య చక్ర అవార్డులు ఉన్నాయి. కీర్తి చక్ర అవార్డులు పొందిన వారిలో ద ఆర్టిలరీకి చెందిన నాయక్ దిల్వర్ ఖాన్ (మరణానంతరం), 22 రాష్ట్రీయ రైఫిల్స్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ మంజిత్ ఉన్నారు. జమ్ము కశ్మీర్లో ధైర్య సాహసాలకు వీరికీ అవార్డు దక్కింది.
పోలీస్ విశిష్ట సేవా పతకాలు దక్కించుకున్న వారిలో 12 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.