డెహ్రాడూన్, జూన్ 20: తన 67వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలుపుతూ కొందరు అంధ బాలల బృందం ఆలపించిన పాటను విని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆప్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబిలిటీస్ (ఎన్ఐఈపీవీడీ)ని సందర్శించారు.