బెంగళూర్ : మద్యంపై 20 శాతం అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచాలని రాష్ట్ర బడ్జెట్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించడంతో (Karnataka) ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల ధరలు భారం కానున్నాయి. చవకైన మద్యం బ్రాండ్ల ధరలను యథాతథంగా కొనసాగించనున్న ఎక్సైజ్ అధికారులు కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరలు నూతన బడ్జెట్ నిర్ణయాలు అమలు చేస్తే ప్రియమవుతాయని చెబుతున్నారు. తొలి శ్లాబ్ (లీటర్‌కు రూ. 449 వరకూ ఉన్న కనిష్ట శ్లాబ్) మినహా ఇతర అన్ని బ్రాండ్ల ధరలు కర్నాటకలో భారీగా పెరుగుతాయని కర్నాటక బ్రూవర్స్ అండ్ డిస్టిలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ తెలిపారు.
బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని క్యాటగిరీల మద్యం ప్రియులపై భారం మోపుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే 78 శాతం వరకూ వినియోగదారులు కనిష్ట, మద్యతరహా శ్లాబ్‌లకు చెందిన మద్యాన్ని కొనుగోలు చేస్తారని, కేవలం 5 శాతం మందే టాప్ బ్రాండ్స్ వైపు మొగ్గుచూపుతారని ఎక్సైజ్ శాఖ వాదిస్తోంది. ప్రతిపాదిత డ్యూటీ పెంపు అనంతరం తమిళనాడు (రూ. 210) ఢిల్లీ (రూ. 190) తర్వాత కర్నాటకలోనే బీరు అత్యంత ప్రియమవుతుందని చెబుతున్నారు.
పొరుగు రాష్ట్రాలతో సమానంగా ప్రీమియం మద్యం బ్రాండ్లు లభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) కర్నాటక ప్రభుత్వాన్ని కోరింది. అధిక పన్నులు విధిస్తే రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్స్ వృద్ధి నిలిచిపోతుందని ఇస్వై సీఈఓ నీతా కపూర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Fruit Carving | ఇంట్లో ఉండే పండ్లు, కూరగాయాలతో ఇలా అద్భుతాలు సృష్టించండి!