చెన్నై, జూన్ 18: ప్రముఖ వ్యాపారవేత్త, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ ప్రేమ్ వాత్స మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను చదివిన మద్రాస్ ఐఐటీలో మెదడుపై పరిశోధనల నిమిత్తం సుధా గోపాలకృష్ణ బ్రెయిన్ సెంటర్‌కు ఐదు మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ.41 కోట్లు) విరాళంగా అందజేశారు.
ఇండో కెనడియన్ బిలియనర్గా గుర్తింపు పొందిన ప్రేమ్వాత్స కెనడియన్ వారెన్ బఫెట్‌గా పేరొందారు. అత్యంత అంకిత భావం, నాణ్యతతో ఐఐటీ మద్రాస్‌కు చెందిన గోపాలకృష్ణ బ్రెయిన్ సెంటర్ అద్భుతమైన పరిశోధనలు నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.