గ్యాంగ్‌టక్, జూన్ 10: సిక్కిం సీఎంగా ఎస్కేఎం అధినేత ప్రేమ్‌సింగ్ కుమార్ తమాంగ్(56) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గ్యాంగ్‌టక్‌లో ఆయన చేత ప్రమాణం చేయించారు. తమాంగ్ సిక్కిం పాలనా పగ్గాలు చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. తమాంగ్‌తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్‌ను ఓడించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో చోటు దక్కింది. గతంలో తమాంగ్‌పై తిరుగుబాటు చేసిన మణికుమార్ శర్శను ఓడించిన నర్ బహదూర్ దహాల్ను కూడా మంత్రి పదవి వరించింది. అధికార పార్టీలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా క్యాబినెట్లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. తమాంగ్ నేతృత్వంలోని ఎస్కేఎం తాజా శాసనసభ ఎన్నికల్లో 32 స్థానాలకు గాను 31 సీట్లలో ఘన విజయం సాధించింది.