Odisha Healthcare | 7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు.. బీజేపీ పాలిత ఒడిశాలో దురవస్థ
బీజేపీ పాలిత ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఓ గర్భిణిని 108 అంబులెన్స్ సిబ్బంది ఏడు కిలోమీటర్ల దూరం స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. మారుమూల గ్రామానికి రహదారి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కరణ్జియా బ్లాక్‌లోని దుధియాని పంచాయతీ పరిధిలోని అన్లకాంత గ్రామంలో జరిగింది. సుమిత్ర శుంధికి పురిటి నొప్పులు రావడంతో దవాఖానకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- బీజేపీ పాలిత ఒడిశాలో దురవస్థ
భువనేశ్వర్, ఆగస్టు 24: బీజేపీ పాలిత ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఓ గర్భిణిని 108 అంబులెన్స్ సిబ్బంది ఏడు కిలోమీటర్ల దూరం స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. మారుమూల గ్రామానికి రహదారి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కరణ్జియా బ్లాక్‌లోని దుధియాని పంచాయతీ పరిధిలోని అన్లకాంత గ్రామంలో జరిగింది. సుమిత్ర శుంధికి పురిటి నొప్పులు రావడంతో దవాఖానకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. అయితే రహదారి లేకపోవడంతో అంబులెన్స్‌ను గర్భిణి ఉన్న ప్రదేశం వరకు తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. సిబ్బంది ఆమెను ప్ట్రెచర్పై పెట్టుకుని కాలినడకన తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంబులెన్స్ డ్రైవర్ గోపాల్ చంద్ర నాయక్, అటెండెంట్ అంకిత్ మొహంతా, స్థానికుడు మునురామ్ సోరెన్ కలిసి సుమారు ఏడు కిలోమీటర్ల మేర ఆమెను స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. రహదారి ఉన్న ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అక్కడి నుంచి ఆమెను కరణ్జియా దవాఖానకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

