లక్నో, అక్టోబర్ 5: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు కలిసి గర్భిణి అని కూడా చూడకుండా ఒక మహిళను దారుణంగా కొట్టి చంపిన ఘటన బీజేపీ పాలిత యూపీలో చోటుచేసుకుంది. మణిపూర్‌లోని గోపాల్పూర్ గ్రామంలో ఈ దారుణం జరిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు.
రంగ్‌పూర్ గ్రామానికి చెందిన బాధితురాలు రజినీ కుమారి (21) వివాహం సచిన్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే టెంట్ హౌస్ వ్యాపారం కోసం రూ.5 లక్షల అదనపు కట్నం తెమ్మని భర్త, అత్తింటివారు డిమాండ్ చేశారు. ఆమె ఆ డబ్బును తేలేకపోవడంతో శుక్రవారం ఆమె భర్త, అతని సోదరులు, బంధువులు గర్భిణి అయిన కుమారిని దారుణంగా హింసించి చంపేశారు. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా వారి పొలంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు భర్త సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.