High Court | న్యూఢిల్లీ : గర్భం దాల్చడం వ్యాధి లేదా అంగవైకల్యం కాదని, మహిళకు ప్రభుత్వోద్యోగాన్ని నిరాకరించడానికి ఇది ఓ కారణం కాకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శారీరక సామర్థ్య పరీక్షను వాయిదా వేయాలని ఓ గర్భిణి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)ను మందలించింది. ఆ గర్భిణి పట్ల ఆర్పీఎఫ్, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును దుయ్యబట్టింది. కెరీర్ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు మహిళలకు గల హక్కుకు గర్భం దాల్చడం ప్రాతిపదికపై వివక్ష ఎన్నడూ అడ్డంకిగా మారకూడదని స్పష్టం చేసింది.