మైసూరు, డిసెంబర్ 25 : మైసూరులోని చారిత్రక కేఆర్ఎస్ రోడ్డు పేరు మార్పు ప్రతిపాదన వివాదాన్ని రాజేసింది. ఆ రోడ్డు పేరును సిద్ధరామయ్య ఆరోగ్య మార్గ్‌గా మార్చాలన్న ప్రతిపాదనను జనతా దళ్(ఎస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఎంసీసీకి ఎన్నికైన కౌన్సిల్ లేకపోవడంతో పేరు మార్చే అజెండాను తాము నియమించిన అధికారుల ద్వారా అమలు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం నియమించిన అధికారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రుణాన్ని తీర్చుకునేందుకు ఆయన పేరును కేఆర్ఎస్ రోడ్డుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ ప్రతిపాదన మైసూరు చారిత్రక వైభవానికి, ప్రజలకు అవమానమని, పౌరులకు ద్రోహం చేయడమేనని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. ముడాను దోపిడీ చేసిన అనివీతి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరును చారిత్రక నగరంలోని ఒక రోడ్డుకు పెట్టడం మైసూరు ప్రజలనే కాక యావత్ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని జేడీఎస్ విమర్శించింది.