పాట్నా: రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో ఒక రాజకీయ నేతగా స్వయంగా ఎదుటి పార్టీల వ్యూహంలో చిక్కుకుని ఎదురుదెబ్బ తిని విలవిల్లాడారు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు స్వయంగా ఆయన పార్టీ అభ్యర్థుల నుంచి వెన్నుపోటును ఎదుర్కొన్నారు.
ఐదు నియోజకవర్గాల్లో ఆయనకీ పరిస్థితి ఏర్పడింది. కొందరు తమ నామినేషన్లు రద్దు చేసుకోగా, మరొకరు ఆరోగ్యం, సామాజిక ఒత్తిడి సాకుతో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరికొందరు అయితే నామినేషన్ వేసి పత్తాలేకుండా అదృశ్యమయ్యారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు.