న్యూఢిల్లీ : ప్రధాని మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పీఎం మోదీ విడుదల చేసిన ఒక ఓ వీడియో ప్రకటనను ఉద్దేశిస్తూ, ప్రకాశ్ రాజ్.. ‘ఆయన భయపడ్డారని’ వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ప్రధాని మోదీ అర్ధరాత్రి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశామని, పార్లమెంట్లో కఠిన చట్టం తీసుకువస్తామని ఆ వీడియోలో తెలిపారు. ఈ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసిన ప్రకాష్ రాజ్ ‘డర్ గయా(భయపడ్డారు) నేను భయాన్ని చూడగలను. నా దేశ యువకులకు ధన్యవాదాలు’ అంటూ వ్యాఖ్యానించారు.