బెంగళూరు: హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ(37)ను ‘అసహజ నేరం(పురుషుడిపై లైంగిక దాడి)’ ఆరోపణల కింద కర్ణాటక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 16న ఘన్నికడ ఫామ్‌హౌస్‌లో సూరజ్ తనపై లైంగిక దాడి చేశాడని 27 ఏండ్ల జేడీఎస్ పార్టీ కార్యకర్త ఆరోపించారు.
ఈ ఆరోపణలను సూరజ్ ఖండించారు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే తప్పుడు ఫిర్యాదు చేస్తానని ఆ కార్యకర్తే తనను బెదిరించాడని పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశారు. చివరికి రూ.2 కోట్లయినా ఇవ్వాలని అతడు తనను బ్లాక్మెయిల్ చేశాడని సూరజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి అప్పగించినట్టు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వెల్లడించారు.