బెంగుళూరు: చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది. ఇవాళ ఉదయం తీసిన ఆ ఫోటోను ఇస్రో తన ట్వీట్లో పోస్టు చేసింది. రోవర్ ప్రజ్ఞాన్(Pragyan Rover)కు ఉన్న నావిగేషన్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది. స్మైల్ ప్లీజ్ అని ఇస్రో తన ట్వీట్లో పేర్కొన్నది. చంద్రయాన్-3(Chandrayaan-3) మిషన్ కోసం లాబరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్-సిస్టమ్స్(ఎల్ఈఓఎస్) సంస్థ నావిగేషన్ కెమరాలను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే చంద్రుడిపై సల్ఫర్‌తో పాటు ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు మంగళవారం రోవర్ గుర్తించిన విషయం తెలిసిందే.
Chandrayaan-3 Mission:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The image was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for Electro-Optics Systems… pic.twitter.com/ESQwQVaxhk
— ISRO (@isro) August 30, 2023
ఇవాళ ఉదయం 7.35 నిమిషాలకు ల్యాండర్ విక్రమ్ ఫోటోను రోవర్ తీసింది. ఎల్ఈఓఎస్ సంస్థ బెంగుళూరులోని పీన్యా పారిశ్రామిక ఎస్టేట్‌లో ఉంది. ఇక్కడే 1975లో ఇండియా తన తొలి శాటిలైట్‌ను రూపొందించింది. అంతరిక్ష ప్రయోగాల కోసం ఆ సంస్థ యూనిట్లో అటిట్యూడ్ సెన్సార్లను డిజైన్ చేస్తారు.