Bar Council | న్యూఢిల్లీ : ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు పార్ట్ టైమ్‌గా కాని, ఫుల్‌టైంగా కాని ఏకకాలంలో జర్నలిస్టులుగా పనిచేయరాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. బీసీఐ నిబంధనల్లోని 49వ నిబంధనను బీసీఐ ఉటంకించగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
మొహమ్మద్ కమ్రాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. కమ్రాన్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్న విషయం కోర్టు దృష్టికి వచ్చింది. జర్నలిజాన్ని పూర్తిగా వదిలిపెట్టానని, న్యాయవాదిగానే కొనసాగుతున్నానని కమ్రాన్ అఫిడవిట్ దాఖలు చేశారు.