డెహ్రాడూన్: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్(Kedarnath) ఆలయాన్ని ఇవాళ తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి ఆలయ తలుపులు తీశారు. ఈ సందర్భంగా ఆయన ఛార్‌ధామ్ యాత్రికులకు వెల్కమ్ చెప్పారు. ఉదయం 7 గంటలకు వేద్ర మంత్రోచ్ఛరణ మధ్య కేదారీశ్వరుడి ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఆలయం ఓపెనింగ్ కార్యక్రమ వేళ.. భారతీయ ఆర్మీ బ్యాండ్ వాయించారు. ఘర్వాల్ రైఫిల్స్ బృందం ఆధ్యాత్మిక ట్యూన్స్‌తో భక్తులకు స్వాగతం పలికారు. హెలికాప్టర్ మీద నుంచి భక్తులపై పూలవర్షం కురిపించారు.
Uttarakhand CM Pushkar Singh Dhami participated in rituals of opening of portals of Kedarnath Dham. pic.twitter.com/tetHKgqwRW
— News Arena India (@NewsArenaIndia) May 2, 2025
కేదారీశ్వరుడికి చెందిన పంచముఖి డోలీ గురువారమే కేదార్‌నాథ్‌కు చేరుకున్నది. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు పవిత్రమైన ఊరేగింపు నిర్వహించారు. ఛార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తల కోసం భద్రతను పెంచారు. మరో వైపు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. సోన్‌ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
#WATCH | Uttarakhand: Cultural performances underway at Shri Kedarnath Dham after its portals were opened today for the devotees
CM Pushkar Singh Dhami is also present here on the occasion. pic.twitter.com/6NfrhXQLEB
— ANI (@ANI) May 2, 2025
ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత భక్తులు అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రుద్రాభిషేకం, శివాష్టకం, శివ తాండవ స్తోత్రం, కేదారాష్టక మంత్రాలు చదివారు. కర్నాటక వీరశైవ లింగాయత్‌కు చెందిన ముఖ్య పండితుడు బీమశంకర్ ఆలయంలోకి ప్రవేశించారు. ఆరు నెలల క్రితం కేదారీశ్వరుడికి అభిషేకం చేసిన భస్మాన్ని తొలగించారు. ప్రస్తుతం కేదార్నాథ్ సుమారు మూడు వేలమంది భక్తులు ఉన్నారు. ఆరు నెలల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు.