Poonch terror attack | పూంచ్‌లో ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి.. రంగంలోకి ఎన్ఐఏ.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల ( Poonch terror attack) ఏరివేతకు బయల్దేరిన భారత సైనికులు.. టెర్రరిస్టుల దుశ్చర్యకు బలయ్యారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమంలో బాటా దురియన్‌లో ఆర్మీ ట్రక్‌పై (Army turck) టెర్రరిస్టులు (Terrorists) గ్రెనేడ్లు విసరడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.
బాటా దురియన్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల ( Poonch terror attack) ఏరివేతకు బయల్దేరిన భారత సైనికులు.. టెర్రరిస్టుల దుశ్చర్యకు బలయ్యారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమంలో బాటా దురియన్‌లో ఆర్మీ ట్రక్‌పై (Army turck) టెర్రరిస్టులు (Terrorists) గ్రెనేడ్లు విసరడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఎన్ఐఏ (NIA) అధికారులు మరికాసేట్లో పూంచ్‌కు చేరుకోనున్నారు. కాగా, పూంచ్ ఉగ్రదాడినిక సంబంధించిన వివరాలను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే (Army Chief Gen Manoj Pande) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh ) వివరించారు.
కాగా, ఫూంచ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కేంద్ర పారామిలటరీ బలగాలు ఎలాంటి కదలికలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కోరింది. అంతర్జాతీయ సరిహద్దులతో పాటు, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి సెక్టార్లలో కూడా ఉగ్రవాదులు పాక్ వైపు నుంచి తిరిగి చొరబడకుండా హై అలర్ట్ ప్రకటించారు.

పూంచ్‌లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. కాగా, గుర్తు తెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరడంతో ట్రక్‌లో ఉన్న ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ సైనికులు వీర మరణం పొందారని, ఈ ఘటనలో గాయపడిన ఒక సైనికుడిని రాజౌరీలోని ఆర్మీ దవాఖానకు తరలించామని ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టి నెంట్ కర్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు. పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. భారీ వర్షాలు, వెలుతురు సరిగా లేని వాతావరణాన్ని అవకాశంగా మలుచుకున్న ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారని అధికారులు వెల్లడించారు. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు.https://twitter.com/Whiteknight_IA/status/1649103283867488256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1649103283867488256%7Ctwgr%5Ef2d4dcedc826f3e09f083dea4e8a5c71052d7932%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fpoonch-terror-attack-jammu-kashmir-army-jawans-killed-live-updates-2362616-2023-04-20
ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్‌నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్‌నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్‌కు ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ (White Knight Corps) నివాళులర్పించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
जम्मू-कश्मीर के पुंछ सेक्टर में हुए आतंकी हमले में हमारे 5 जवानों की शहादत का समाचार अत्यंत दुखद है।
उन वीरों को मैं अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं और उनके शोकाकुल परिवारों को अपनी गहरी संवेदना व्यक्त करता हूं।
— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2023
కాగా, పూంచ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు.
Strongly condemn the heinous attack in Poonch. My deepest condolences to the families of the army jawans who were killed.
— Mehbooba Mufti (@MehboobaMufti) April 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

