న్యూఢిల్లీ: వివాదాస్పద ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో యూపీఎస్సీ సిఫారసు చేసినవారిలో ఎవరైనా ఓబీసీ, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేశారా? ఓబీసీ కోటా కింద అనుమతించదగిన వయోపరిమితికి మించి లబ్ధి పొందినవారు ఉన్నా రా? బెంచ్‌మార్క్ డిజెబిలిటీస్ కలిగిన వ్యక్తులకు లభించే ప్రయోజనాలను అనర్హులు పొందారా? అనే అంశాలపై కూడా దర్యాప్తు జరపాలని పాటియాలా కోర్టు ఆదేశించింది.
కోచింగ్ సెంటర్ ఘటనలో కారు డ్రైవర్‌కు బెయిలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో నీరు చేరి ముగ్గురు మరణించిన కేసులో అరెస్టయిన కారు డ్రైవర్ మనూజ్ కఠూరియాకు ఢిల్లీలోని సెషన్స్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ పోలీసులు మితిమీరిన ఉత్సాహాన్ని ప్రదర్శించారని ఎండగట్టింది. మనూజ్ నిర్లక్ష్యంగా కారును నడపటం వల్ల రోడ్డుపైన ఉన్న నీరు బేస్మెంట్లోకి చేరిందని, తద్వారా ఆయన వీరి మరణానికి కారణమయ్యారని పోలీసులు ఆరోపించారు.