KC Tyagi : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పై మాజీ స్పోర్ట్స్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షామా మహ్మద్ చేసిన బాడీ షేమింగ్ (Body Shaming) కామెంట్స్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. రోహిత్ శర్మ ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులు, బీజేపీ నాయకులు షామా వ్యా్ఖ్యలను తప్పుపడుతున్నారు. రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి ఆటగాడని, ఆయన గురించి బాడీ షేమింగ్ చేయడం, క్రికెట్లో ఆయన సాధించిన ఘనతలను తక్కువ చేసి మాట్లాడటం సరైనదిగా కాదని అంటున్నారు.
తాజాగా జేడీయూకు చెందిన సీనియర్ నాయకుడు కేసీ త్యాగి (KC Tyagi) కూడా షామా మహ్మద్ కామెంట్స్‌పై స్పందించారు. రోహిత్ శర్మపై షామా మహ్మద్ కామెంట్స్ విషయాన్ని ఓ మీడియా సంస్థ కేసీ త్యాగి దగ్గర ప్రస్తావించగా ఆయన తన స్పందన తెలియజేశారు. కాంగ్రెస్ మహిళా అధికార ప్రతినిధి షామా మహ్మద్ ఆ వ్యాఖ్యలు చేసేముందు రోహిత్ శర్మ సాధించిన భారీ స్కోర్లను చూడాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. అయినా రాజకీయ నాయకులు క్రీడలకు సంబంధించిన విషయాల్లో జోక్యాన్ని తగ్గించుకోవాలని సూచించారు.