న్యూఢిల్లీ: శాంతిని కోరుకునేవారు తక్షణమే లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం చెప్పారు. మావోయిస్టులు కాల్పుల విరమణను కోరుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు జరిగినది తప్పు అంటూ ఓ లేఖ చక్కర్లు కొడుతున్నది. లొంగిపోవడానికి అంగీకరిస్తూ, కాల్పుల విరమణ జరగాలని కోరుతున్నట్లు దానిలో ఉంది.
కాల్పుల విరమణ ఉండదు. లొంగిపోవాలని అనుకుంటే, కాల్పుల విరమణ అవసరం ఉండదు. మీ ఆయుధాలను వదిలిపెట్టండి, పోలీసులు ఒక తూటానైనా పేల్చరు” అని అన్నారు.