BJP | బీజేపీ ఎంపీలను ఎలా అనుమతించారు?..ప్రతిపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను కలుసుకునేందుకు గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానకు చేరుకున్న విపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని హర్యానా పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. ప్రతినిధి బృందంలో ఆప్, జేఎంఎం, సమాజ్‌వాది పార్టీ ఎంపీలు ఉన్నారు.
- ప్రతిపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
- వాంగ్చుక్ను కలిసేందుకు అనుమతి నిరాకరణ: గీతాంజలి వాంగ్‌చుక్
గురుగ్రామ్, జూలై 22: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను కలుసుకునేందుకు గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానకు చేరుకున్న విపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని హర్యానా పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. ప్రతినిధి బృందంలో ఆప్, జేఎంఎం, సమాజ్‌వాది పార్టీ ఎంపీలు ఉన్నారు. వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులను మాత్రమే దవాఖానలోకి అనుమతిస్తామని విపక్ష ఎంపీలకు పోలీసులు తెలిపారు. దీంతో దవాఖాన గేటు వద్ద ఎంపీలు బైఠాయించి పోలీసుల వైఖరికి నిరసన తెలియచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని అవలంబిస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. వాంగ్చుక్ను కలుసుకునేందుకు బీజేపీ ఎంపీలను అనుమతించిన పోలీసులు విపక్ష ఎంపీలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అనంతరం వాంగ్‌చుక్ భార్య గీతాంజలి వాంగ్‌చుక్ దవాఖాన గేటు వెలుపల విపక్ష ఎంపీలను కలుసుకున్నారు. ‘25 రోజులుగా ఆహారం తీసుకోని ఒక భారతీయ పౌరుడికి ప్రశాంతత లేకుండా చేసి ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేయడం చాలా సిగ్గుచేటు’ గీతాంజలి అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

