లక్నో: ఉత్తరప్రదేశ్లో 19 ఏండ్ల యువతి లైంగికదాడికి గురికాగా.. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే నిందితుడితో బాధితురాలికి పెండ్లి జరిపించి చేతులు దులుపుకున్నారు. అయితే నిందితుడికి అంతకుముందే మరో మహిళతో వివాహం అయిన సంగతి ఆలస్యంగా వెలుగుచూడటంతో బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడు సాజిద్ అలీపై పోలీసులు సెక్షన్ 376(లైంగికదాడి) కింద కేసు నమోదుచేశారు. హమీర్పుర్ జిల్లా కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ గత ఏడాది నవంబర్ 26న ఓ బిడ్డకు జన్మనిచ్చింది.సాజిద్ అలీపై జనవరి 3న బాధితురాలు ఫిర్యాదు చేసింది.