తిరువనంతపురం: ఖాళీ బుల్లెట్లను పెన్నంపై వేడి చేసేందుకు పోలీస్ అధికారి ప్రయత్నించాడు. వాటిల్లో గన్‌పౌడర్ ఉండటంతో పేలుడు సంభవించింది. (Officer Heats Bullets) అయితే మంటలు వ్యాపించక పోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. కేరళలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. మార్చి 10న త్రిపుణితురలోని కొచ్చి సిటీ పోలీసులకు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ క్యాంపులోని కిచెన్‌లో ఖాళీ బుల్లెట్లను పెన్నంపై వేడి చేసేందుకు ఒక పోలీస్ అధికారి ప్రయత్నించాడు. వాటిల్లో గన్‌పౌడర్ ఉండటంతో పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్లు ఉన్న ఆ కిచెన్‌లో మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో ఆ అధికారి నిర్లక్ష్యంపై అంతర్గతంగా దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, పోలీసు అధికారులు, ప్రముఖుల అంత్యక్రియల కోసం గన్‌పౌడర్ ఉన్న ఖాళీ బుల్లెట్లను వినియోగిస్తారని పోలీస్ అధికారి తెలిపారు. తుప్పు పట్టిన వాటిని వినియోగించేందుకు ఎండలో ఉంచుతారని చెప్పారు.
మరోవైపు ఒక పోలీస్ అధికారి అంత్యక్రియల కోసం ఖాళీ బుల్లెట్లను ఎస్ఐ సిద్ధం చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే కాస్త తుప్పుపట్టిన వాటిని ఎండలో ఉంచడం బదులుగా పెన్నంపై ఆయన వేడి చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వేడికి ఖాళీ బుల్లెట్లలో ఉన్న గన్‌పౌడర్ వల్ల పేలుడు సంభవించినట్లు వివరించారు. గ్యాస్ సిలిండర్లు ఉన్న ఆ కిచెన్‌లో మంటలు పెద్దగా వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.