శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం పోలీసు హెడ్‌కానిస్టేబుల్ గులాం మహమ్మద్ దార్‌పై ఆయన ఇంటి వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు. దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
కశ్మీర్లో గత మూడు రోజుల్లో ఇది మూడో ఉగ్రదాడి. ఆదివారం శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం పుల్వామాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు.