భగల్‌కోట్: చంద్రయాన్-3 మిషన్‌పై కామెంట్ చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj)పై కర్నాటకలో కేసు నమోదు చేశారు. భగల్‌కోట్ జిల్లాలోని బానహట్టి పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. హిందూ సంఘాల నేతలు ఆ కేసు బుక్ చేశారు. నటుడు ప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ విక్రమ్ .. రేపు సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే. అయితే నటుడు ప్రకాశ్ రాజ్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఓ కార్టూన్‌ను అతను పోస్టు చేశాడు. లుంగి కట్టుకున్న ఓ వ్యక్తి.. టీ పోస్తున్నట్లు ఆ కార్టూన్లో ఉంది. చంద్రుడి నుంచి వచ్చిన తొలి ఫోటో ఇదే అని ఆ పోస్టులో ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఈ పోస్టుపై ఆన్లైన్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విమర్శించడం సరికాదు అని నెటిజెన్లు అన్నారు.
BREAKING NEWS:-
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G— Prakash Raj (@prakashraaj) August 20, 2023