Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసులపై కాల్పులు, ఇళ్లకు నిప్పు
Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. (Manipur Violence) పోలీస్ కమాండోలపై మిలిటెంట్స్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ కమాండోకు గాయాలయ్యాయి. అలాగే ఆందోళనకారులు కొందరి ఇళ్లకు నిప్పుపెట్టారు.
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. (Manipur Violence) పోలీస్ కమాండోలపై మిలిటెంట్స్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ కమాండోకు గాయాలయ్యాయి. అలాగే ఆందోళనకారులు కొందరి ఇళ్లకు నిప్పుపెట్టారు. మణిపూర్‌లోని సరిహద్దు నగరమైన మోరేలో ఈ సంఘటన జరిగింది. శనివారం అనుమానిత తిరుగుబాటుదారులు, పోలీసు కమాండోల మధ్య కాల్పులు జరిగాయి. మోరే నుంచి పెట్రోలింగ్ పాయింట్ వైపు వెళ్తున్న పోలీసు వాహనాల కాన్వాయ్‌పై మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగించారు. పోలీస్ కమాండోలపై కాల్పులు జరిపారు.
ఒక కమాండో గాయపడగా, అస్సాం రైఫిల్స్ క్యాంపునకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, మోరేలో తాజాగా హింస చెలరేగింది. కొందరు వ్యక్తులు రెండు ఇళ్లకు నిప్పుపెట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో సంఘటనలో రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్పోక్పిలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడ్ని కాల్చి చంపారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ సంఘటన జరిగింది.
మరోవైపు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ యువకుడి హత్యను ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నిందితులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. సమస్యలను చర్చలు ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

