న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: పాస్పోర్టు దరఖాస్తుదారులు ఇక ఆన్లైన్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) పొందొచ్చు. పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పీసీసీలను జారీచేయాలని నిర్ణయించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
ఈ సేవలు ఈ నెల 28 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. పాస్పోర్టు జారీకి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే, పీసీసీలు ఇవ్వడంలో స్థానిక పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో పాస్పోర్టు జారీకి సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సేవలను ఆన్లైన్ చేశారు.