బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ హఠాన్మరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. శనివారం తన సోదరుడి సినిమా విడుదలవుతుందని తెలిసి ఆ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఆ తర్వాత కాసేపటికే గుండెపోటుతో జిమ్‌లో కుప్పకూలారు. అక్కడి నుంచి బెంగళూరులోకి విక్రమ్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
ఆ తర్వాత కాసేపటికే ‘అప్పు’ అస్తమించాడని డాక్టర్లు వెల్లడించారు. ఈ వార్తతో కన్నడ నాట శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్రంలో హైఅలర్ట్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరులోని పలు ప్రాంతాలు షట్‌డౌన్ అయ్యాయి. ఈ క్రమంలో బెంగళూరులో అక్టోబరు 31 అంటే సోమవారం వరకూ ఆల్కహాల్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించారు.