Heart Stroke | డెహ్రాడూన్ : గుండెపోటు.. ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం. పసి పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందర్నీ గుండెపోటు వెంటాడుతోంది. ప్రతి రోజు ఏదో ఒక చోట, ఎవరో ఒకరు గుండెపోటుకు గురై చనిపోతున్నారు. తాజాగా ఓ కవి వేదికపై కవిత్వం చదువుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో జనవరి 28న చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లోని జీబీ పంత్ యూనివర్సిటీలో పంత్నగర్ కావ్య మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవులు, రచయితలు, కళాకారులు హాజరయ్యారు. ఓ కవి వేదికపై కవిత్వం చదువుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుకు గురైన అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
पंतनगर काव्य महोत्सव में कवि को हार्टअटैक आया।
📍उधमसिंह नगर, उत्तराखंड pic.twitter.com/CET9TYOcde— Sachin Gupta (@SachinGuptaUP) January 29, 2024