Lord Rama Tallest Statue : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనతో హిందువుల దశాబ్దాల కలను సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మరో చరిత్రకు నాంది పలికారు. ఇటీవలే అక్కడి రామాలయంపై కాషాయం జెండాను ఎగురేసిన మోడీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గోవాలోని చరిత్రాత్మక శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జోవోత్తమ్ మఠం (Shree Samsthan Gokarn Jeevottam Mutt)లో గురువారం 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహా (Lord Rama Tallest Bronze Statue )న్ని ఆయన ప్రారంభించారు.
దక్షిణ గోవాలోని ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జోవోత్తమ్ మఠం ఏర్పడి నవంబర్ 28 గురువారం నాటికి 550వ సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంగా పునస్కరించుకొని ప్రధాని మఠంలో 77 అడుగుల ఎత్తైన కోదండరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘అయోధ్య రామాలయంపై కాషాయం జెండాను ఎగరేసిన రెండుమూడు రోజులకే రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు. గుజరాత్లో సర్దార్ పటేల్ ఏకతా స్టాచ్యూ తయారు చేసిన ప్రముఖ శిల్పకారుడు రామ్ సుతార్ (Ram Sutar) ఈ భారీ రాముడి కాంస్య విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
VIDEO | Prime Minister Narendra Modi will unveil a 77-feet bronze statue of Lord Ram, believed to be the tallest in the world, at Shree Samsthan Gokarn Partagali Jeevottam Math in South Goa on November 28. Sculpted by Ram Sutar, the event marks 550 years of the Math tradition,… pic.twitter.com/ojE462yzvl
— Press Trust of India (@PTI_News) November 27, 2025
#WATCH | Canacona, South Goa | PM Modi addresses on the occassion of the 550th-year celebration of the Shree Samsthan Gokarn Partagali Jeevottam Math
(Source: ANI/DD) pic.twitter.com/me0qyxrLch
— ANI (@ANI) November 28, 2025
ప్రధాని మోడీ హెలిక్యాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:45 గంటలకు శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జోవోత్తమ్ మఠం చేరుకున్నారు. మఠం ఆవరణలోని మందిరాన్ని సందర్శించుకున్న మోడీ.. రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించాక వేల సంఖ్యలో విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహత్తర కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్తో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జోవోత్తమ్ మఠం 550 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున 11 రోజుల పాటు.. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు 7 వేల నుంచి 10 వేల మంది రాముడి విగ్రహాన్ని దర్శించుకునే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు.