PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. జీఎస్టీ సంస్కరణలు (GST reforms) రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం (Modi speech) పై ఆసక్తి నెలకొంది. జీఎస్టీ తగ్గింపుపైనే ప్రధాని ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి. ఇప్పటివరకు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబ్లు ఉండగా.. 28 శాతం శ్లాబ్ పరిధిలోని వస్తువులను 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా 12 శాతం పరిధిలోని వస్తువులను 5 శాతం పరిధిలోకి, 5 శాతం పరిధిలోని వస్తువులను జీరో శాతం పరిధిలోకి తెచ్చారు.