మూడో ముప్పు ఎదుర్కొనేందుకు రెడీ : 1500 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు!

న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తే ఆ ముప్పును ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 1500 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాలపై శనివారం ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు.
దవాఖానల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు. పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం ప్రారంభిస్తే నాలుగు లక్షల ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ లభ్యమవుతుందని తెలిపారు.
ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై దవాఖానల సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లు సత్వరమే పనిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును స్ధానికంగా, జాతీయ స్ధాయిలో పర్యవేక్షించేందుకు అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

