న్యూఢిల్లీ, మే 13: ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని ఓ వైపు ప్రజలకు పిలుపునిస్తూ, మరోవైపు తనకు మాత్రం భారీ కాన్వాయ్ ఉండటంపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ సైజును తగ్గించారు.
ఎస్పీజీ ప్రొటోకాల్ ప్రకారం అత్యవసర భద్రతాంశాలను కొనసాగిస్తూనే కాన్వాయ్ సైజు తగ్గింపు జరిగింది. కొత్తగా కొనుగోళ్లు చేయకుండా సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తన కాన్వాయ్‌లో చేర్చాలని ప్రధాని కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలువురు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, మంత్రులు మోదీ బాటలో నడిచారు.